ఈ వ్యాధులే రక్తంలో ప్లేట్‌లెట్లు తగ్గడానికి కారణం
ప్లేట్‌లెట్లు మన శరీరానికి చాలా అవసరమైనవి. ఇవి రక్తంలో ఉండే చిన్న కణాలు, గాయాలప్పుడు రక్తం గడ్డకట్టే ప్రక్రియలో ముఖ్యపాత్ర వహిస్తాయి. శరీరంలో ప్లేట్‌లెట్లు తక్కువగా ఉంటే, చిన్న గాయాలు కూడా పెద్ద సమస్యగా మారవచ్చు. సాధారణంగా ఆరోగ్యకరమైన వ్యక్తిలో ఒక్క మైక్రోలీటర్ రక్తంలో 1.5 లక్షల నుండి 4.5 లక్షల ప్లేట్‌లెట్లు ఉంటాయి. 1.5 లక్షల కంటే తక్కువ ఉంటే జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. 50 వేల కంటే తక్కువ ప్లేట్‌లెట్లు ఉంటే ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా ఉంటుంది. 20 వేల కంటే తక్కువ ఉంటే ప్రాణాంతకం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ వ్యాధులే ప్లేట్‌లెట్లు తగ్గడానికి కారణం
డెంగ్యూ, చికున్‌గున్యా, మలేరియా వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు
టైఫాయిడ్, ఇతర వైరల్ జ్వరాలు
కాలేయ సమస్యలు (సిర్రోసిస్)
బోన్ మారో సమస్యలు
క్యాన్సర్, కీమోథెరపీ
ఆటోఇమ్యూన్ వ్యాధులు
ప్లేట్‌లెట్ లోపం లక్షణాలు
సులభంగా గాయపడటం
రక్తస్రావం ఆగకపోవడం
చర్మంపై ఎరుపు లేదా ఊదా రంగు మచ్చలు
ముక్కు, దంతాల నుండి రక్తస్రావం
మహిళల్లో నెలసరి సమయంలో అధిక రక్తస్రావం
అలసట, నీరసం, తల తిరగడం
ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుని సంప్రదించడం చాలా ముఖ్యం.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి.
పరిశుభ్రత పాటించాలి.
దోమలు లేకుండా చూసుకోవాలి.
పోషకాహారాలు తినాలి (ఆకుకూరలు, పండ్లు, ప్రోటీన్)
పుష్కలంగా నీరు తాగాలి.
జ్వరాన్ని, నీరసాన్ని నిర్లక్ష్యం చేయకూడదు.
వైద్య సలహా లేకుండా మందులు తీసుకోకూడదు.
ప్లేట్‌లెట్ల సంఖ్యను సక్రమంగా ఉంచడం శరీర ఆరోగ్యానికి అత్యంత ముఖ్యం. ఏవైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుల సలహా తీసుకోని, సకాలంలో చికిత్స పొందడం అవసరం.









Comments