• Apr 21, 2026
  • NPN Log

    ఐపీఎల్ 2026లో వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిన తర్వాత జట్టు విజయం సాధించడంతో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య సంతోషం వ్యక్తంచేశాడు. ఈ విజయం తమకు చాలా ప్రత్యేకమైనదని తెలుపుతూ సెంచరీ హీరో తిలక్‌పై ప్రశంసలు కురిపించాడు. 14 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 103 పరుగులతో ఉన్న ముంబై జట్టు.. తిలక్ విధ్వంసంతో ప్రత్యర్థి ముందు 200 పరుగుల భారీ టార్గెట్‌ను నిర్దేశించింది. ముంబై ఇన్నింగ్స్‌లో క్రీజులో ఉన్న తిలక్ వర్మ, కెప్టెన్ పాండ్య మధ్య తీవ్ర చర్చ జరిగింది. పాండ్య సీరియస్ తిలక్ వర్మకు ఏదో చెప్పాడు. మ్యాచ్ గెలిచిన అనంతరం తిలక్ వర్మతో తాను ఏం మాట్లాడినది పాండ్య రివిల్ చేశాడు.

    హర్దిక్ పాండ్య మీడియాతో మాట్లాడుతూ... ‘ఇది మాకు చాలా ముఖ్యమైన మ్యాచ్. అహ్మదాబాద్‌లో గతంలో ఎప్పుడూ మేం గెలవలేదు. అందుకే ఈ విజయం మాకు ఎంతో ప్రత్యేకమైనది. 14వ ఓవర్ టైమ్‌ అవుట్ తర్వాత విరామంలో క్రీజులో ఉన్న నేను తిలక్ వర్మతో మాట్లాడాను. అతను ప్రతిభావంతుడు. దేని గురించి ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పాను. పరిస్థితితో సంబంధం లేకుండా బంతిని కొట్టమని అతనికి సందేశమిచ్చా. ఎందుకంటే వర్మ బంతిని కొట్టే విధానం చాలా ప్రత్యేకమైనదని నేను నమ్ముతున్నాను. తిలక్ చెప్పే సందర్భంలో నేను కొన్నిసార్లు ఎంత గట్టిగా అరిచానంటే నాకు తల బద్దలైనట్లు అనిపించింది. కానీ, ఇదంతా జట్టు గెలుపు కోసమే’ అని హార్దిక్ తెలిపాడు.

    ముంబై ఇన్నింగ్స్‌లో 14వ ఓవర్ టైమ్ అవుట్ సమయానికి తిలక్ వర్మ 22 బంతుల్లో కేవలం 19 పరుగులు మాత్రమే చేశాడు. పాండ్యతో మాట్లాడిన తర్వాత తిలక్ వర్మ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. తర్వాత 23 బంతుల్లో 82 పరుగులు చేశాడు. టైమ్ అవుట్ తర్వాత గుజరాత్ టైటాన్స్ బౌలర్లను ఊచకోత కోశాడు. దీంతో పాండ్య సందేశంతోనే తిలక్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడని క్రీడా నిపుణులు అభిప్రాయపడ్డారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement