• Jun 05, 2026
  • NPN Log

    సోమర్సెట్‌ల్ : పిల్లల్లో అంధత్వ నివారణే ధ్యేయంగా, గత 50 ఏళ్లుగా నిరంతరాయంగా విశేష సేవలందిస్తున్న 'ఐ ఫౌండేషన్ ఆఫ్ అమెరికా' సంస్థకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అండగా నిలిచింది. అంధత్వ రహిత సమాజ స్థాపనలో భాగంగా భారీ విరాళాన్ని అందజేసింది. ఇటీవల జరిగిన ఒక ప్రత్యేక సేవా, సంస్కృతిక కార్యక్రమంలో నాట్స్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి, నాట్స్ నాయకుల బృందం కలిసి ఈ విరాళానికి సంబంధించిన మొత్తాన్ని చెక్కు రూపంలో అధికారికంగా ఐ ఫౌండేషన్ ఆఫ్ అమెరికా బోర్డ్ ఆఫ్ ట్రస్టీ శ్యామ్ మద్దాళికి అందజేశారు.

    ఈ కార్యక్రమంలో నాట్స్ నాయకులు శేఖరం కొత్త, శ్రీనివాస్ గుత్తికొండ, శ్రీధర్ అప్పసాని, ప్రశాంత్ పిన్నమనేని, గంగాధర్ దేసు, బాపు నూతి, రాజ్ అల్లాడ, హరి బుంగటావుల, టీపీ రావు, బిందు యలమంచిలి, శ్యామ్ నాళం, శ్రీనివాస్ భీమినేని, కిరణ్ మందడి, వంశీ కొప్పురావూరి తదితరులు పాల్గొన్నారు. ఐ పౌండేషన్ ఆఫ్ అమెరికా చేస్తున్న సేవలను నాట్స్ నాయకులు అభినందించారు.

    ఐ పౌండేషన్ ఆఫ్ అమెరికా వ్యవస్థాపకులు వి.కె. రాజు, ప్రెసిడెంట్ లీలీ వి. రాజు, బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు శ్యామ్ మద్దాళి, శేఖర్ వెంపరాల, శ్రీను మద్దులలు అంధత్వ నివారణకు చేస్తున్న కృషిని నాట్స్ నాయకులు ప్రత్యేకంగా ప్రశంసించారు.

    పిల్లల కళ్లల్లో కాంతిని నింపే ఇలాంటి మహత్కార్యాల్లో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఎలాంటి లాభాపేక్ష లేని ఇలాంటి ఉచిత వైద్య సేవలను భారతదేశంలోని కంటి సమస్యలున్న పేదలందరికీ చేరేలా ప్రచారం చేయాలని నాట్స్ ప్రతినిధులు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

    రాజమండ్రిలో $20 మిలియన్లతో సరికొత్త క్యాంపస్..

    డాక్టర్ వి.కె. రాజు నేతృత్వంలోని గౌతమి ఐ ఇన్‌స్టిట్యూట్, ఈ 50 ఏళ్ల మైలురాయి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో 20 మిలియన్ డాలర్ల భారీ బడ్జెట్‌తో సరికొత్త అంతర్జాతీయ స్థాయి భవనాన్ని నిర్మిస్తోంది. ఈ క్యాంపస్ ద్వారా దేశవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వచ్చే పేద రోగులకు పూర్తి ఉచితంగా కంటి ఆపరేషన్లు, చికిత్సలు అందించనున్నారు. అలాగే భవిష్యత్తు అవసరాల కోసం అత్యుత్తమ ఆప్తమాలజిస్టులకు (కంటి వైద్యులకు) ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement