కేజీబీవీ దరఖాస్తు గడువు 10వరకు పొడిగింపు
ఆంధ్రప్రదేశ్ : కేజీబీవీ స్కూళ్లలో 2026-27లో ప్రవేశానికి దరఖాస్తు గడువును ఈనెల 10 వరకు పొడిగిస్తున్నట్లు SSA ఎస్పీడీ శ్రీనివాసరావు తెలిపారు. 6, 11 తరగతుల్లో అన్ని సీట్లతో పాటు 7, 8, 9, 10, 12 క్లాసుల్లో ఖాళీ సీట్లకు బాలికలు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తుకు ఇవాళ్టితో గడువు ముగియగా పేరెంట్స్ వినతి మేరకు పెంచినట్లు చెప్పారు. ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలన్నారు.










Comments