కృత్రిమ ఊపిరితిత్తులు.. IITH పరిశోధనలు
ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఐఐటీ హైదరాబాద్ ఓ శుభవార్త అందించింది. కృత్రిమ ఊపిరితిత్తుల అభివృద్ధి దిశగా పరిశోధనలు చేస్తున్నట్లు తెలిపింది. జర్మనీకి చెందిన ఇన్‌స్టిట్యూట్ ఫర్ లంగ్ హెల్త్‌తో కలిసి ఈ పరిశోధనలు చేయనుంది. అవయవ మార్పిడి అవసరం లేకుండా శాశ్వత పరిష్కారం అందించడమే లక్ష్యంగా IIT హైదరాబాద్ పని చేస్తోంది. విజయవంతమైతే త్వరలోనే ఆర్టిఫీషియల్ లంగ్స్ అందుబాటులోకి రానున్నాయి.










Comments