క్యాబినెట్ అజెండాలోకి ‘నల్లమలసాగర్’
తెలంగాణ : నల్లమలసాగర్ ప్రాజెక్టుపై క్యాబినెట్ సమావేశంలో చర్చించి ముందుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 18న మేడారంలో జరిగే క్యాబినెట్ అజెండాలో ఈ అంశాన్ని చేర్చింది. నల్లమలసాగర్‌పై ఆంధ్ర ప్రదేశ్ ని కట్టడిచేసేలా న్యాయపరమైన అంశాలన్నిటినీ దీనిలో చర్చించనుంది. ఇటీవల వేసిన పిటిషన్‌కు విచారణార్హత లేదని సుప్రీం కోర్ట్ చెప్పడంతో తెలంగాణ ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. దీంతో సివిల్ దావాను పగడ్బందీగా దాఖలు చేసేందుకు నిర్ణయించింది.










Comments