గత నాలుగు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న 8500 కోట్ల స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ లను వెంటనే విడుదల చేయాలి -విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజులను ఎత్తివేసేందుకు ప్రభుత్వం చేస్తున్న కుట్రలుమానుకోవాలి -రేవంత్ రెడ్డి పాలన ప్రజాపాలన కమిషన్ లా పాలనానా అని మండిపడ్డ ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు
తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 20 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో రేవంత్ రెడ్డి సర్కార్ చెలగాటమాడుతుందని, తక్షణమే అన్ని కోర్సులకు సంబంధించిన పెండింగ్ రియంబర్స్మెంట్ బకాయిలను చెల్లించాలని కాకతీయ యూనివర్సిటీ దూరవిద్య ప్రాంగణం వద్ద కేయూ ఐక్యవిద్యార్థి సంఘాల నాయకుల ఆధ్వర్యంలో రిలేనిరాహారదీక్ష చేయడం జరిగింది..ఈ సందర్భంగా ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు బొచ్చు తిరుపతి,ఆరెగంటి నాగరాజు, డి. తిరుపతి,మర్రి మహేష్, మాట్లాడుతూ… ప్రభుత్వ,ప్రైవేటు, యూనివర్సిటీలలోని కళాశాలలలో అన్ని కోర్సులకు సంబంధించి విద్యార్థులకు చెల్లించాల్సిన బకాయిలు దాదాపు 8500 కోట్ల రూపాయల రియంబర్స్మెంట్ ప్రభుత్వం చెల్లించకుండా విద్యార్థులపై తీవ్ర నిర్లక్ష్యాన్ని రేవంత్ సర్కార్ అవలంబిస్తుందని, ఒకపక్క బడ్జెట్ లేదంటూనే మూసి ప్రక్షాళన, ప్రాజెక్టుల పేరు మీద వేలకోట్ల రూపాయలు కేటాయించే రేవంత్ రెడ్డి తన వద్ద ఉన్న విద్యాశాఖకు సంబంధించిన పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు సంబంధించిన రియంబర్స్మెంట్ మాత్రం చెల్లించకపోవడం విద్యార్థి జీవితాలతోచెలగాటమాడుతున్నాడని, ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలే నిరవధిక బందుకు పిలుపునిచ్చే పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని అన్నారు.ఫీజు రియంబర్స్మెంట్ విడుదలకై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉదృతం చేస్తుందని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు యజమాన్యంతో 600 కోట్ల రూపాయలను దసరా తర్వాత మరొక 600 కోట్ల రూపాయలను దీపావళి తర్వాత ఇస్తామని చెప్పి ప్రైవేట్ కళాశాలల యజమాన్యాలతో చర్చలు జరిపి ఒప్పించడం జరిగింది కానీ మీరు విడుదల చేస్తామన్న 600 కోట్ల రూపాయలు విద్యార్థి లోకానికి న్యాయం జరిగేలా లేవు. వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వెంటనే 8500 కోట్ల రూపాయలను విడుదల చేయాలి..అని కాకతీయ యూనివర్సిటీ ఐక్య విద్యార్థి సంఘాల నుంచి డిమాండ్ చేయడం జరిగింది..లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 11 యూనివర్సిటీలలో ఉన్నటువంటి విద్యార్థులను ఏకం చూసి ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో రీసెర్చ్ స్కాలర్ కీతపాక ప్రసాద్ కదికొండ తిరుపతి , విద్యార్ధి సంఘాల నాయకులు బొట్ల మనోహర్, ఎల్తూరి సాయి, ఉప్పుల శివ కుమ్మరి శ్రీనాత్, పెండేలా రాకేష్, బొక్క ప్రవర్ధన్,చింతం అంజనేయులు, శ్రీదేవి స్రవంతి పట్ట శేఖర్, ఓర్స్ చిరంజీవి, వందల సంఖ్యలో పాల్గొన్నారు...
Comments