గిరిజన ప్రాంతాల్లోనూ నగరస్థాయి వైద్యం
హైదరాబాద్ : గిరిజన, అటవీ ప్రాంతాల్లోని ప్రజలకు కూడా నగరంలో అందుబాటులో ఉన్న అన్నిరకాల వైద్య సేవలు సమకూర్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదిలాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో అందుతున్న వైద్య సేవలు , మౌలిక వసతులు, అభివృద్థి పనుల పురోగతిపై తన చాంబర్లో మంత్రి సమీక్షించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు, పాయల్ శంకర్, డాక్టర్ పాల్వాయి హరీశ్ బాబు, కోవ లక్ష్మి, రామారావు పవార్, అనిల్ జాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ రిమ్స్‌తో పాటు ఆసిఫాబాద్, నిర్మల్ ప్రభుత్వ వైద్య కళాశాలలు, జనరల్ హాస్పిటళ్లు, జిల్లా, ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్ల పనితీరును మంత్రి సమీక్షించారు. తమ నియోజకవర్గాల్లో ప్రభుత్వ ఆస్పత్రుల పనితీరు గతంతో పోలిేస్త గణనీయంగా మెరుగుపడిందని ఎమ్మెల్యేలు మంత్రికి తెలిపారు. మంత్రి మాట్లాడుతూ ట్రైబల్ ఏరియాల్లో ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్థికి ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నామని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో జనాభా ప్రాతిపదికనే కాకుండా, వైద్య ేసవలు పొందేందుకు ప్రయాణించాల్సిన దూరాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని ఆరోగ్య మౌలిక వసతులను అభివృద్థి చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వం ప్రతి మండలానికి ఒక అంబులెన్స్‌ను మంజూరు చేసిందని, త్వరలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా హాస్పిటళ్లకు కూడా అనుబంధంగా అదనపు అంబులెన్స్‌లను సమకూరుస్తామన్నారు.










Comments