• Apr 03, 2026
  • NPN Log

    చిత్తూరు : చిత్తూరు జిల్లాలోని తవణంపల్లి మండలంలో దారుణ ఘటన వెలుగుచూసింది. మొదలపల్లి గ్రామానికి చెందిన లవ కుమార్ (28) అనే యువకుడిని గుర్తు తెలియని దుండగులు అత్యంత కిరాతకంగా హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని సమీప చెరువులో పడేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. స్థానికుల సమాచారం ప్రకారం.. లవకుమార్ గత కొంత కాలంగా అమర్ రాజా అనే కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అతడిని హతమార్చి, మృతదేహాన్ని సమీపంలోని చెరువులో పడేశారు. చెరువులో మృతదేహం తేలడాన్ని గమనించిన గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పాత కక్షల వల్ల ఈ హత్య జరిగిందా? లేక మరేదైనా కారణం ఉందా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలో వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించిన పోలీసులు, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement