డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా బుక్కైన నైజీరియా మహిళ
సికింద్రాబాద్: డ్రగ్స్ రవాణా చేస్తున్న నైజీరియన్ మహిళను సికింద్రాబాద్ డీటీఎఫ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబై నుంచి హైదరాబాద్‌కు మాదకద్రవ్యాలు ఆమె రవాణా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. పక్కా సమాచారంతో సదరు మహిళ నుంచి 2.35 లక్షల విలువైన 7.5 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఐదు పాకెట్లలో దాచి డ్రగ్స్ తెస్తుండగా పట్టుకున్నారు పోలీసులు. నిందితురాలిని నైజీరియాకి చెందిన జేమ్స్ టెస్లింగ్ యామ్యూనల్గా గుర్తించారు. ముంబైలో గ్రాము రూ.15 వేల చొప్పున కొనుగోలు చేసి హైదరాబాద్‌కు తెస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ గ్రాము కొకైన్ రూ.30 వేల చొప్పున విక్రయించి సొమ్ము చేసుకునేందుకు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.









Comments