చంద్రబాబూ.. అధికారంలోకి వచ్చింది ఇందుకేనా: జగన్
ఆంధ్రప్రదేశ్ : ‘పేదలకు ఇళ్ల’ విషయంలో కూటమి ప్రభుత్వ పనితీరు సున్నా అని మాజీ సీఎం, YCP అధినేత జగన్ విమర్శించారు. ‘చంద్రబాబు గారూ మీకు అధికారం ఇచ్చింది పేదలపై కత్తికట్టడానికా? వారి సొంతింటి కలలను నాశనం చేయడానికా? ఇప్పటివరకూ ఏ ఒక్కరికీ పట్టాలివ్వలేదు. మా హయాంలో ఇచ్చిన వాటిని లాక్కుంటున్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తాం. నిరసనలు, ఆందోళనలకు సిద్ధం కావాలని పార్టీ కేడర్‌కు పిలుపునిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.
Comments