ఛత్తీస్‌గఢ్‌లో 29 మంది నక్సల్స్ లొంగుబాటు
చర్ల : ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లాలో పోలీసుల ఎదుట బుధవారం 29 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీ రంతా దర్బా, కేరళపాల్ ఏరియా కమిటీ సభ్యులని జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ తెలిపారు. 29 మంది మావోయిస్టులు లొంగిపోవడంతో కేరళపాల్ ఏరియా కమిటీ పూర్తిగా తుడిచిపెట్టుకు పోయిందన్నారు. లొంగిపోయిన మావోయిస్టులకు తక్షణసాయం కింద నగదు, పునరావాసం కల్పిస్తామని తెలిపారు. సుకుమా జిల్లాలో 90ు నక్సల్స్ కార్యకలాపాలు తగ్గాయన్నారు.










Comments