జట్టు నుంచి తప్పించిన సెలెక్టర్లు.. కౌంటర్ ఇచ్చిపడేసిన ప్లేయర్
ఫామ్‌లో లేరని ప్లేయర్లను సెలెక్టర్లు జట్టు నుంచి తప్పించడం క్రికెట్ లో చాలా సర్వసాధారణ విషయం. అంతేకాక జట్టులో స్థానం కోల్పోయిన వారు చాలా కాలం తరువాత గానీ తిరిగి టీమ్ లో స్థానం సంపాదించలేరు. ఇది ఇలా ఉంటే కొందరు సెలెక్టర్లు కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. జట్టు ఎంపిక విషయంలో మిస్టేక్స్ జరిగే సందర్భాలు అనేకం ఉంటాయి. ఈ క్రమంలో జట్టులో స్థానం కోల్పోయిన ప్లేయర్లు వివిధ రూపాల్లో సెలెక్టర్లకు గట్టి కౌంటర్ ఇస్తుంటారు. తాజాగా ఆస్ట్రేలియా సీనియర్ ప్లేయర్ మార్నస్ లాబుషేన్ ఆసీస్ జట్టు సెలెక్టర్లకు దిమ్మతిరిగే రిప్లయ్ ఇచ్చాడు. మరి..ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
అక్టోబర్ 19న టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని భారత్ జట్టు వచ్చే వారం ఆస్ట్రేలియాకు వెళ్లనుంది. ఇదే సమయంలో భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌కు ఆసీస్ బ్యాట్స్‌మన్ మార్నస్ లాబుషేన్ దూరంగా ఉన్నాడు. అతడు ఫామ్ లో లేడనే కారణంతో భారత్ తో జరిగే సిరీస్ కు మార్నస్ ను సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. తాజాగా దేశవాళీ క్రికెట్లో వరుసగా తాను మూడో సెంచరీ సాధించడం ద్వారా తాను ఫామ్ లో ఉన్నానని సెలెక్టర్లకు పరోక్షంగా ఇచ్చి పడేశాడు. ఇది త్వరలో ఇంగ్లాండ్ లో జరిగే యాషెస్ సిరీస్ కోసం వెళ్లే జట్టులో స్థానం పొందే అవకాశాలను ఖచ్చితంగా బలోపేతం చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
స్వదేశంలో భారత్ తో జరిగే వన్డే సిరీస్ నుంచి తప్పుకున్న తర్వాత మార్నస్ లాబుషేన్ దేశీయ క్రికెట్లో సంచలనం సృష్టించాడు. క్వీన్స్‌ల్యాండ్ తరపున ఆడుతున్న లాబుషేన్ 91 బంతుల్లో 105 పరుగులు చేశాడు. వాటిలో ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. అతడు చేసిన ఈ స్కోర్ క్వీన్స్ లాండ్.. టాస్మానియాపై 50 ఓవర్లలో 311 పరుగులు చేయడానికి సహాయపడింది. తన చివరి నాలుగు ఇన్నింగ్స్‌లలో ఇది మూడవ సెంచరీ.
Comments