జడ్డంగిలో (PACS) సొసైటీ ద్వారా ఎరువుల పంపిణీ లేదు !
రాజవొమ్మంగి PACS ద్వారా జడ్డంగిలో ఉన్న గోడౌన్ వద్ద సొసైటీ అధ్యక్షుడు ముప్పన కేశవరావు రైతులకు ఎరువుల పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షుడు కేశవరావు మాట్లాడుతూ రైతులు తమ పట్టాదార్ పాస్ బుక్కు, ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీలను తీసుకువచ్చి సొసైటీ లో ఉన్నటువంటి యూరియా, పటాస్, వేప పిండి, జింక్ బస్తాలను సబ్సిడీలో పొందవచ్చని, తాను ఒక రైతు కుటుంబం నుండి వచ్చిన వాడినని,రైతుల బాధలు తెలిసిన వాడినని సొసైటీ ద్వారా రైతులకు మేలు కలిగే విధంగా చూస్తానని, యూరియా కొరత లేకుండా చూసి రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, అన్నారు ఈ కార్యక్రమంలోAMC డైరెక్టర్ గట్టి మాణిక్యం, తెలుగుదేశం పార్టీ నాయకుడు గణజాల తాతారావు, వాసంశెట్టి గంగాధర్,భారంగి అనుదీప్, కోపూరి రత్నం, కంఠపురెడ్డి వీరబాబు, కూటమి నాయకులు, రైతులు,సొసైటీ సిబ్బంది,పాల్గొన్నారు.
Comments