టెన్త్ విద్యార్థులకు స్నాక్స్.. నిధులు విడుదల
తెలంగాణ : పదో తరగతి విద్యార్థులకు ఈవెనింగ్ స్నాక్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.4.23కోట్ల నిధులను విడుదల చేసింది. వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులందరికీ ఈవెనింగ్ స్నాక్స్ అందించాలని డీఈవోలను ఆదేశించింది. ఫిబ్రవరి 16 నుంచి మార్చి 10వ తేదీ వరకు వీటిని అందించాలని ఆదేశాల్లో పేర్కొంది. కాగా రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరగనున్నాయి.










Comments