• Jun 05, 2026
  • NPN Log

    టీమిండియా స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను టెస్టు వైస్ కెప్టెన్సీ నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. అతడి స్థానంలో కేఎల్ రాహుల్‌ను సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఇరుజట్ల మధ్య శనివారం నుంచి ఏకైక టెస్టు ముల్లాన్‌పూర్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ క్రమంలో భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడాడు. పంత్‌ను తొలగించడంపై తొలిసారిగా స్పందించాడు. ఈ నేపథ్యంలో పలు కీలక విషయాల గురించి వెల్లడించాడు.

    ‘పంత్ తన ఆటతీరును పూర్తిగా మార్చుకోవాల్సిన అవసరం లేదు. తన దూకుడును అలాగే కొనసాగించాలి. కానీ అంతర్జాతీయ ప్లేయర్లు పరిస్థితులకు తగ్గట్టుగా ఆడాల్సిన అవసరం ఉంటుంది. పంత్‌కు మా పూర్తి మద్దతు ఉంటుంది. సందర్భానుసారంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది కాబట్టే వైస్ కెప్టెన్సీపై ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది’ అని గంభీర్ వెల్లడించాడు.

    రిషబ్ పంత్ ప్రస్తుతం ఫామ్‌లేమితో ఇబ్బందులు పడుతున్నాడు. ఐపీఎల్ 2026లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌కు సారథ్యం వహించిన పంత్.. పేలవ ప్రదర్శన కనబర్చాడు. జట్టును పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిపాడు. దీనికి బాధ్యత వహిస్తూ పంత్.. ఎల్ఎస్‌జీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.

    శ్రీలంక సిరీస్ కోసం..

    ప్రస్తుతం అఫ్గానిస్థాన్‌తో టెస్టులో కుల్‌దీప్ యాదవ్ ప్రధాన స్పిన్నర్. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌కు రెస్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆగస్టు మధ్యలో రెండు టెస్టుల సిరీస్ కోసం భారత్.. శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో స్పిన్నర్ల గురించి కూడా గంభీర్ స్పందించాడు. ‘మానవ్ సుతార్, హర్ష్ దూబె రూపంలో ఇద్దరు యువ స్పిన్నర్లు ఉన్నారు. అఫ్గాన్‌తో మ్యాచ్ వారికి మంచి అవకాశం. అలాగే మాక్కూడా శ్రీలంకతో టెస్టుల కోసం నాలుగో స్పిన్నర్‌ను పరీక్షించుకొనేందుకు వీలు కలుగుతుంది. అదేవిధంగా న్యూజిలాండ్ పర్యటన కోసం కాస్త భిన్నంగా సన్నద్ధం కావాల్సి ఉంది. టెస్టులు ఆడే కొందరిని అఫ్గాన్‌తో వన్డే సిరీస్ నుంచి తప్పిస్తాం. టెస్టుల కోసం మరింత సన్నద్ధత అవసరం అనేదే మా భావన’ అని గౌతీ వెల్లడించాడు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement