• Jun 13, 2026
  • NPN Log

    తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్  2026 ఫలితాలను ఉన్నత విద్యామండలి అధికారికంగా విడుదల చేసింది. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య బాలకిష్టారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు ఫలితాలను ప్రకటించారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ హాల్‌టికెట్ నంబర్‌ను నమోదు చేసి ర్యాంక్ కార్డులను పొందవచ్చు. ఫలితాల విడుదలతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థుల్లో ఉత్కంఠకు తెరపడింది.

    రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలల్లో ఎంబీఏ (MBA), ఎంసీఏ (MCA) కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్ష నిర్వహించారు. టీజీ ఐసెట్-2026 నిర్వహణ బాధ్యతలను మహాత్మా గాంధీ యూనివర్సిటీ, నల్గొండ చేపట్టింది. మే 13, 14 తేదీల్లో నిర్వహించిన ఈ పరీక్షకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యారు. అనంతరం అధికారులు ప్రిలిమినరీ ఆన్సర్ కీని విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించి వాటిని పరిశీలించారు. తుది ప్రక్రియ పూర్తయిన తర్వాత తాజాగా ఫలితాలను ప్రకటించారు.

     

     

    అభ్యర్థులు అధికారిక https://icet.tgche.ac.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లి హాల్‌టికెట్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి తమ ర్యాంక్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫలితాల ఆధారంగా త్వరలోనే ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. దీంతో అభ్యర్థులు తదుపరి అడ్మిషన్ ప్రక్రియపై దృష్టి సారిస్తున్నారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement