నోటిఫికేషన్లపై వదంతులు నమ్మొద్దు: ఏపీపీఎస్సీ
అమరావతి : ఉద్యోగాల భర్తీపై సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న సమాచారం అవాస్తవమని ఏపీపీఎస్సీ శుక్రవారం ఓ ప్రకటనలో స్పష్టంచేసింది. సోషల్ మీడియాలో కనిపిస్తున్న షెడ్యూలును కమిషన్ విడుదల చేయలేదని, అభ్యర్థులు అసత్య ప్రచారం నమ్మొద్దని, ఎలాంటి సమాచారం అయినా కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌లోనే అందుబాటులో ఉంచుతామని వివరించింది.









Comments