తహసీల్దార్ చేతుల మీదుగా AIYF క్యాలెండర్ ఆవిష్కరణ.
AIYF 2026 నూతన సంవత్సర క్యాలెండర్లను దేవనకొండ తాసిల్దార్ ఎం. సుదర్శనం చేతులమీదుగా ఆవిష్కరించినట్లు ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి సి. రమేష్, మండల అధ్యక్ష, కార్యదర్శులు బి. రవికుమార్, ఎమ్. రామాంజనేయులు తెలిపారు. గురువారం దేవనకొండలో ఏఐవైఎఫ్ క్యాలెండర్ ల ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యువత ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారం కోసం ఏఐవైఎఫ్ నిరంతర ఉద్యమాలు నిర్వహిస్తుందన్నారు. యువతకు విద్యా వైద్యం ఉపాధి హక్కుల కోసం ఉద్యమాలు కొనసాగించాలని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శులు కృష్ణ, రాజశేఖర్, ఏఐఎస్ఎఫ్ మండల అధ్యక్ష, కార్యదర్శులు మధు, భాస్కర్ నాయకులు నరేష్, రఫీ తదితరులు పాల్గొన్నారు.










Comments