దారుణం.. విష ప్రయోగంతో 600 కుక్కలు మృతి
తెలంగాణ : కామారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. వీధికుక్కలపై విషప్రయోగం జరగడంతో దాదాపు 500-600 శునకాలు మృతిచెందాయి. మాచారెడ్డి(M) ఫరీద్‌పేట్, భవానీపేట, వాడి, పల్వంచలో నూతనంగా ఎంపికైన సర్పంచ్‌లు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఘటనపై ‘గౌతమ్ స్ట్రే యానిమల్స్ ఫౌండేషన్’ ప్రతినిధులు చేసిన ఫిర్యాదుతో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు.










Comments