నేటి నుంచి U-19 వన్డే వరల్డ్ కప్
జింబాబ్వేలో నేటి నుంచి ICC U-19 వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. జులవాయో వేదికగా ఇవాళ భారత జట్టు USAను ఢీకొట్టనుంది. ఇప్పటి వరకు 16 సార్లు టోర్నీ జరగ్గా భారత్ 5 టైటిళ్లు గెలిచింది. ఆరోసారి కప్ సొంతం చేసుకోవాలని ఆయుష్ మాత్రే సారథ్యంలో బరిలోకి దిగుతోంది. ఇక 14ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీపైనే అందరి దృష్టి నిలిచింది. అటు ఇవాళ ఇతర మ్యాచుల్లో జింబాబ్వే-స్కాట్లాండ్, టాంజానియా-వెస్టిండీస్ పోటీ పడనున్నాయి.









Comments