• Jun 05, 2026
  • NPN Log

    అమరావతి : ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)కు పాఠశాల విద్యాశాఖ శుక్రవారం నోటిఫికేషన్‌ విడుదల చేస్తుందని మంత్రి లోకేశ్‌ వెల్లడించారు. టెట్‌-2026 షెడ్యూల్‌ను గురువారం ఆయన ‘ఎక్స్‌’లో విడుదల చేశారు. ఈ షెడ్యూల్‌ ప్రకారం శుక్రవారం నుంచే దరఖాస్తుల ప్రక్రియ మొదలవుతుంది. జూలై 5 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ విధానంలోనే దరఖాస్తులు సమర్పించాలి. జూలై 15 నుంచి మాక్‌ టెస్ట్‌లు అందుబాటులో ఉంటాయి. 25న హాల్‌టికెట్లు విడుదల చేస్తారు. ఆగస్టు 5 నుంచి 21 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. ఆగస్టు 24న ప్రాథమిక కీ విడుదల చేస్తారు. దీనిపై అభ్యంతరాలు స్వీకరించి సెప్టెంబరు 8న తుది కీ విడుదల చేస్తారు. సెప్టెంబరు 15న తుది ఫలితాలు వెల్లడిస్తారు. కాగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా విడుదల చేసిన జాబ్‌ క్యాలెండర్‌లో భాగంగా అక్టోబరులో డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇస్తామని మంత్రి లోకేశ్‌ తెలిపారు. టెట్‌ రాయబోయే అభ్యర్థులకు, ఇన్‌ సర్వీస్‌ టీచర్లకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement