నరసాపురంలో నల్లిక్రిక్ కాజ్వేకు గండి
నరసాపురం : తుఫాన్ బీభత్సానికి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం చినలంకకు వెళ్లే నల్లీక్రిక్ కాజ్‌వే వంతెనకు గండిపడింది. సముద్రకెరటాలు ఎగసి.. కాజ్‌వేను ముంచెత్తడంతో గండిపడి రోడ్డు రెండు ముక్కలైంది. దీంతో దానికి ఆనుకుని ఉన్న వందల ఎకరాల్లోని ఆక్వా చెరువులు నీట మునిగాయి. మత్స్యకారులు చేపల వేటకు దీని గుండానే వెళతారు. దీని పునర్నిర్మాణానికి ప్రభుత్వం ఇటీవల నిధులు మంజూరు చేసింది. త్వరలో పనులు చేపట్టాల్సి ఉంది.










Comments