• Jan 15, 2026
  • NPN Log

    నెల్లూరు: పండుగ పూట పెను ప్రమాదం తప్పంది. కావలి ముసునూరు ప్రాంతంలో ట్యాంకర్లతో వెళ్తున్న గూడ్స్ రైలు గురువారం ఉదయం పట్టాలు తప్పింది. వైజాగ్ నుంచి రేణిగుంటకి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. రైలులోని మూడు బోగీలు పూర్తిగా పట్టాలు తప్పాయి. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు.. హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణం నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.


    పలు రైళ్ల ఆలస్యం..

    రైలు పట్టాలు తప్పడంతో రైల్వే ట్రాక్ స్వల్పంగా దెబ్బతిన్నట్టు అధికారులు గుర్తించారు. ఈ కారణంగా పలు రైళ్లు ఆలస్యంగా నడవనున్నట్టు సమాచారం. వెంటనే ​ట్రాక్ పునరుద్ధరణ చర్యలు చేపట్టేందుకు అధికారులు, సిబ్బంది సన్నాహాలు చేస్తున్నారు. దీంతో, ​ఈ మార్గంలో ప్రయాణించే పలు రైళ్ల రాకపోకలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement