పండుగకు రెండు ప్రత్యేక రైళ్లు..
ఏలూరు : సంక్రాంతి పండుగకు జిల్లా మీదుగా రెండు ప్రత్యేక రైళ్లను నడపడానికి రైల్వే అధికారులు చర్యలు చేపట్టారు. చర్లపల్లి- కాకినాడ (07480) టౌన్ రైలును ఈ నెల19వ తేదీన నడపనున్నారు. చర్లపల్లిలో ఉదయం 10 గంటలకు బయలుదేరి రాత్రి 9.30 గంటలకు కాకినాడ చేరుకుంటుంది. కాకినాడ టౌన్ - చర్లపల్లి (07481) రైలు ఈనెల 19వ తేదీన రాత్రి 11:15 గంటలకు కాకినాడ టౌన్లో బయలు దేరి మరుసటి రోజు ఉదయం 11:45 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. ఈ రైళ్ళు నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ళ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, రాజమండ్రి సామర్లకోట స్టేషన్లలో ఆగనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
విజయవాడ - విశాఖపట్నం మధ్య జనసాధన్..
విజయవాడ - విశాఖపట్నం మధ్య ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న దృష్ట్యా జనసాధన్ ప్రత్యేక రైళ్ళను (అన్ రిజర్వుడ్) నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. విశాఖపట్టణం - విజయవాడకు (08567), విజయవాడ - విశాఖపట్నానికి (08568) జనవరి 13, 14, 16, 17, 18 తేదీలలో నడుపుతున్నట్లు తెలిపారు. ఈ రైళ్ళు విశాఖపట్నం, దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, గన్నవరం, విజయవాడ స్టేషన్లలో ఆగనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.










Comments