పండుగపూట ఘోర రోడ్డుప్రమాదం.. ఐదుగురు మృతి..
భోపాల్: మధ్యప్రదేశ్లో పండుగ పూట ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. రాష్ట్ర రాజధాని భోపాల్లో గురువారం వ్యాన్-ట్రాక్టర్ ఢీకొని ఐదుగురు మృతిచెందగా.. సుమారు 10మంది తీవ్రంగా గాయపడ్డారు. మకర సంక్రాంతి సందర్భంగా నర్మదాపురంలోని గుడికి వెళ్లి వస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
పోలీసుల వివరాల మేరకు.. భోపాల్ జిల్లా బెరాసియా ప్రాంతంలో వ్యాన్, ట్రాక్టర్ ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ప్రమాద సమయంలో వ్యాన్లో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. వీరిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు. మృతులంతా సిరోజ్ ప్రాంతానికి చెందినవారని పోలీసులు వెల్లడించారు. మరో పది మంది గాయపడగా.. అందులో ముగ్గురు చిన్నారులు ఉన్నట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను స్థానిక హమీదియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలం వద్ద పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.










Comments