• Jun 13, 2026
  • NPN Log

    వివో లవర్స్ కోసం అద్భుతమైన ఆఫర్.. వివో ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ వివో X300 భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది. 200MP కెమెరాతో ఈ వివో ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో అతి చౌకైన ధరకే కొనేసుకోవచ్చు. ఈ వివో ఫోన్ 6040mAh బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 9500 ప్రాసెసర్‌తో   వస్తుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో మరింత ఆదా చేయొచ్చు. వివో X300 ఫోన్ డిస్కౌంట్లు, ధర, స్పెసిఫికేషన్లకు సంబంధించి పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి..

     

    వివో X300 ధర, ఆఫర్లు :
    వివో X300 ఫోన్ 12GB+256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 75,999గా ఉంది. బ్యాంక్ ఆఫర్లతో ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు పేమెంట్లపై రూ. 7,500 తగ్గింపు పొందవచ్చు. దాంతో వివో ఫోన్ అసలు ధర నుంచి రూ. 68,499కు తగ్గుతుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో రూ. 55,600 వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ రీసేల్ వాల్యూ ప్రస్తుత పాత ఫోన్ వర్కింగ్ కండిషన్, మోడల్‌పై ఆధారపడి ఉంటుంది.

    వివో X300 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
    వివో X300లో 1216×2640 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.31-అంగుళాల 1.5K బీఓఈ Q10+ ఎల్టీపీఓ ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 9500 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికొస్తే.. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఒరిజిన్OS 6పై రన్ అవుతుంది.

     

     

    సేఫ్టీ కోసం ఇందులో ఇన్-డిస్‌ప్లే 3D అల్ట్రాసోనిక్ సింగిల్-పాయింట్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. 90W వైర్డ్ 40W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 6040mAh బ్యాటరీతో వస్తుంది. ఇందులో 16GB LPDDR5x అల్ట్రా ర్యామ్ 512GB యూఎఫ్ఎస్ 4.1 ఇన్‌బిల్ట్ స్టోరేజ్ ఉన్నాయి. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68, IP69 రేటింగ్‌ అందిస్తుంది.

     

     

    కెమెరా విషయానికి వస్తే..
    వివో X300 బ్యాక్ సైడ్ OIS సపోర్ట్‌తో 200MP HPB ప్రైమరీ కెమెరా, 50MP JN1 వైడ్-యాంగిల్ కెమెరా, OIS సపోర్ట్‌తో 50MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50MP ఫ్రంట్ కెమెరా ఉంది.

     

     

    కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, 4G, బ్లూటూత్ 6, Wi-Fi, GPS, NFC, OTG, సింగిల్ USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. కొలతల పరంగా, ఈ ఫోన్ 150.57 మిమీ పొడవు, 71.92 మిమీ వెడల్పు, 7.95 మిమీ మందం, 190 గ్రాముల బరువు ఉంటుంది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement