బీచిగానిపల్లి పంచాయతీలో కాఫీ విత్ వైసీపీ క్యాడర్ కార్యక్రమంను నిర్వహించి, గ్రామ ప్రజలను పలకరించిన మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షురాలు, పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఉషశ్రీచరణ్ గారు..*
13-01-2026 మంగళవారం...
ఈరోజు శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం, పరిగి మండలం, బీచిగానిపల్లి పంచాయతీ వంగలపల్లి, పాత్రగానిపల్లి గ్రామాలలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ప్రతి గడపకు వెళ్లి, జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాడని, ఎప్పుడు ప్రజలు శ్రేయస్సు కోరే జననాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు అని ప్రతి ఒక్కరికి గుర్తు చేశారు, రైతులకు ప్రతి ఏడాది రైతు భరోసా తో పాటు పంట బీమా ఇస్తూ రైతులకు భరోసా నిలబడ్డ ఏకైక నాయకుడు జగనన్న గారు అని అన్నారు, ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి రెండు సంవత్సరాలు అవుతున్న ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను తీవ్రంగా అన్యాయం చేశారని, ప్రతి ఒక్కరికి వివరిస్తున్న రాష్ట్ర మాజీ మంత్రి,శ్రీ సత్యసాయి జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షురాలు & పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి కె.వి.ఉషశ్రీచరణ్ గారు..
ఈ కార్యక్రమంలో భాగంగా బీచిగానిపల్లి పంచాయతీలో పంచాయతీ వైసిపి నాయకులు కార్యకర్తలు ప్రజలతో కలిసి పంచాయతీ కమిటీ నిర్వహించారు, ఈ కార్యక్రమంలో పరిగి మండల ప్రజా ప్రతినిధులు, మండల నాయకులు, వైసీపీ కార్యకర్తలు,బీచిగానిపల్లి పంచాయతీ మరియు వంగలపల్లి, పాత్రగానిపల్లి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు..










Comments