• Jan 15, 2026
  • NPN Log

    భారత సంతతికి చెందిన గణిత శాస్త్రవేత్త నళిని జోషి .. న్యూ సౌత్‌వేల్స్  సైంటిస్ట్ ఆఫ్ ది ఇయర్‌-2025 అవార్డుకు ఎంపికయ్యారు. ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని సొంతం చేసుకున్న తొలి గణిత శాస్త్రవేత్తగా ఆమె గుర్తింపు పొందారు. అంతేకాకుండా సిడ్నీ గణిత ప్రొఫెసర్‌గా  ఈ అవార్డుకు ఎంపికైన మొదటి మహిళ కూడా ఆమే కావడం విశేషం.

    ఇదీ నేపథ్యం..

    నళిని జోషి మయన్మార్‌ లో జన్మించారు. ఆమె చిన్నతనంలో వారి కుటుంబం ఆస్ట్రేలియాకు వలస వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. దీంతో ఆమె సిడ్నీలోనే విద్యనభ్యసించారు. సిడ్నీ విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్(బీఎస్సీ), ప్రిన్స్‌టన్ యూనివర్శిటీలో డాక్టరేట్ పూర్తి చేశారామె. ఆ తర్వాత యూనివర్శిటీ ఆఫ్ సిడ్నీలో గణిత ప్రొఫెసర్‌గా  నియమితులై.. ఆ విభాగంలో మొదటి మహిళగా గుర్తింపు పొందారామె. బోధనలో పరిశోధనలను ఎంతగానో ఇష్టపడే నళిని.. గణిత విభాగంలో అంతుచిక్కని పరిష్కారాలను వివరించేందుకు కొత్త పద్ధతులను అభివృద్ధి చేశారు. ఇంటిగ్రబుల్‌ సిస్టమ్స్‌పై విశేష పరిశోధనలు చేసిన ఆమె.. 2016లో ప్రతిష్ఠాత్మక 'ఆఫీసర్‌ ఆఫ్‌ ది ఆర్డర్‌ ఆఫ్‌ ఆస్ట్రేలియా' పురస్కారాన్ని అందుకున్నారు. ప్రస్తుతం.. ఆమె ఐఎంయూ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలు, దాని ఐఎస్‌సీ ప్రతినిధిగా విధులు నిర్వహిస్తున్నారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement