మగవారికి కూడా పీరియడ్స్ వస్తే బావుండు.. రష్మిక కామెంట్స్ వైరల్
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రస్తుతం ది గర్ల్ ఫ్రెండ్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా మారింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీక్షిత్ శెట్టి హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. నవంబర్ 7 న ది గర్ల్ ఫ్రెండ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన రష్మిక, రాహుల్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నారు.
ఇక తాజాగా రష్మిక.. జగపతి బాబు హోస్ట్ చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా షోకు గెస్ట్ విచ్చేసింది. ఈ షోలో రష్మికను జగ్గు భాయ్ ఒక ఆట ఆడుకున్నాడు. చిన్నప్పడు స్కూల్ లో ఆమె చేసిన డ్యాన్స్ నుంచి కెరీర్, సినిమాలు, విజయ్ గురించి అన్ని విషయాలను పంచుకుంది. అయితే.. జగపతి బాబు.. రష్మిక కోరికను ఒకటి బయటపెట్టాడు. మగాళ్ళకు కూడా పీరియడ్స్ వస్తే బావుండు అని ఫీల్ అయ్యినట్టున్నావ్ అని అడగ్గా .. రష్మిక అవును .. మగాళ్లకు ఒక్కసారి వచ్చి.. ఆ భాద ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవాలంటే అబ్బాయిలకు రావాలి' అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రష్మిక వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో రష్మిక ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.








Comments