మెట్లెక్కుతుంటే ఆయాసం వస్తోంది
టోక్యో: దశాబ్దంపాటు ట్రాక్ అండ్ ఫీల్డ్ ఏలిన జమైకా స్ర్పింట్ కింగ్ ఉసేన్ బోల్ట్ (39) రిటైర్మెంట్ తర్వాత అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్నట్టు చెప్పాడు. ఒకప్పుడు భూమిపై వేగవంతమైన అథ్లెట్‌గా గుర్తింపు దక్కించుకొన్న బోల్ట్.. ఇప్పుడు మెట్లెక్కడానికి కూడా ఆయాసపడుతున్నట్టు తెలిపాడు. వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షి్‌ప్సకు అతిథిగా హాజరైన బోల్ట్ తన రోజువారీ జీవనశైలి గురించి మీడియాతో ఆసక్తికర విషయాలు పంచుకొన్నాడు. ‘పిల్లలు స్కూల్‌కు వెళ్లే సమయానికి నిద్రలేస్తా. పిల్లలు స్కూలు నుంచి తిరిగి వచ్చేదాకా వెబ్‌సిరీ్‌సలు చూస్తూ గడిపేస్తా. జిమ్‌కు కొంతకాలం దూరంగా ఉన్నా. ఇకనైనా పరిగెత్తడం మొదలెట్టాలి. ఎందుకంటే మెట్లెక్కేటప్పుడు ఆయాసం వస్తోంది. మళ్లీ రన్నింగ్ ఆరంభిస్తే శ్వాస తీసుకోవడం మెరుగుపడుతుంద’ని బోల్ట్ చెప్పాడు. వెన్నెముక సమస్యతోపాటు మడమ నొప్పితో బోల్ట్ బాధపడుతున్నాడు. బోల్ట్ 2017లో రిటైరయ్యాడు.
Comments