• Jun 05, 2026
  • NPN Log

    హైదరాబాద్ : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మల్కాజిగిరి చోరీ కేసులో నేపాలీ గ్యాంగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత నెలలో(మే నెల) మల్కాజిగిరి పరిధిలోని రిటైర్డ్ ప్రొఫెసర్ నివాసంలో నేపాలీ ముఠా భారీ చోరీకి తెగబడింది. ఇప్పటికే ఈ కేసులో ఇద్దరు కీలక సూత్రధారులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. తాజాగా మరో నలుగురిని పుణేలో అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఆరుగురు సభ్యులు పోలీసు కస్టడీలో ఉన్నారు. వీరిని ప్రస్తుతం పుణె నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు మల్కాజిగిరి పోలీసులు తెలిపారు.

    రిటైర్డ్ ప్రొఫెసర్ ఇంట్లో రాత్రి సమయంలో చొరబడిన నేపాలీ గ్యాంగ్.. లక్షల రూపాయల విలువైన నగలు, నగదు, ఇతర వస్తువులను అపహరించింది. ఈ చోరీ హైదరాబాద్‌లో తీవ్ర చర్చనీయాంశమైంది. వెంటనే కేసు నమోదు చేసిన మల్కాజిగిరి పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్‌లు, సెల్‌ఫోన్ లొకేషన్ డేటా ఆధారంగా గ్యాంగ్‌ను ట్రాక్ చేశారు. నేపాలీ ముఠా దేశంలోని వివిధ నగరాల్లో చోరీలకు పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement