రూపాయి క్షీణత.. హెచ్చుతగ్గుల్లో భాగమే: RBI గవర్నర్
ఇటీవల రూపాయి విలువ పడిపోతుండటం తెలిసిందే. డాలర్‌తో పోలిస్తే రూపీ వాల్యూ రూ.90ని దాటింది. అయితే ఇది సాధారణ హెచ్చుతగ్గుల్లో భాగమేనని RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా అన్నారు. ‘రూపాయి, మారకపు రేట్లపై RBI విధానం ఏళ్లుగా స్థిరంగా ఉంది. మార్కెట్లు బలంగా ఉన్నాయని మేం నమ్ముతున్నాం. ధరలను అవే నిర్ణయిస్తాయి’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. భారత ఎకానమీ మూలాలు బలంగా ఉన్నాయని తెలిపారు.










Comments