రేపు OTTలోకి ‘మహావతార్ నరసింహ’
చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించిన ‘మహావతార్ నరసింహ’ సినిమా OTT రిలీజ్ డేట్ ఖరారైంది. రేపటి నుంచి Netflixలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. మహా విష్ణువు నరసింహావతారం ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించారు. జులై 25న విడుదలైన ఈ యానిమేటెడ్ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.
Comments