రాయదుర్గం నియోజకవర్గం సిపిఐ ఏపీ రైతు సంఘం* *గవి సిద్దేశ్వర స్టీల్, ఐరన్ ఫ్యాక్టరీ కాలుష్యంతో రైతుల పంట పొలాలకు తీవ్ర నష్టం*
Npn,news.ఫ్యాక్టరీ కాలుష్యం దుమ్ము దూళి నుండి తమ పంట పొలాలను కాపాడాలని సిపిఐ రైతు సంఘం నాయకులకు విన్నవించుకున్న ఆయత్తపల్లి ఉడేగోళం రైతులు
ఫ్యాక్టరీ కాలుష్యం నుండి 714 ఎకరాల వరకు రైతులు నష్టపోతున్న సందర్భం
రేపటి రోజున రైతులతో కలిసి రాయదుర్గం ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ధర్నా
సిపిఐ రాయదుర్గం నియోజకవర్గం కార్యదర్శి నాగార్జున ఎపి రైతు సంఘం తాలూక కార్యదర్శి తిప్పేస్వామి మాట్లాడుతూ
ఆయత్తుపల్లి. బీసీకాలనీ. ఉడేగోళం రైతులను ఆదుకోవాలని ఐరన్ఓవర్ ఫ్యాక్టరీ నుండి వెలుపడే కాలుష్య వల్ల పంటలు పాడైపోతున్నాయని ఆ గ్రామాల రైతులు ఈరోజు సిపిఐ కార్యాలయం దగ్గర కి వచ్చి వారి గోడును వినిపించారు. రైతుల సమస్యలు తీరేదాకా అండగా సిపిఐ పార్టీ రైతు సంఘం ఉంటుందని వారికీ భరోసా కల్పించారు. గౌసిద్వేశ్వర ఫ్యాక్టరీ విషయానికొస్తే గతంలో కూడా ఒక కార్మికుడు ఫ్యాక్టరీలో గాయపడితే నామమాత్రంగా ఆదుకున్న పరిస్థితి. గతంలో భూపాసముద్రం గ్రామానికి చెందిన ఒక వాచ్మెన్ చనిపోతే ఇంటికి వెళ్లి మరి ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పిన మేనేజర్ ఇప్పటివరకు ఆ కుటుంబాన్ని పట్టించుకోలేదు. చాలా సందర్భాల్లో ఆ ఫ్యాక్టరీ నుండి సమస్యలు ఎదుర్కొన్న కార్మికులు ప్రజలు ఉన్నారు. ఉడేగోళం. ఆయతపల్లి. బీసీ కాలనీ రైతులను ఆదుకోవాలి వీరు అనేకసార్లు ఫ్యాక్టరీ యాజమాన్యంతో చర్చల కోసం వెళ్లిన తమ ఫ్యాక్టరీ వల్ల వచ్చు దుమ్ము ధూళి వల్ల నష్టపో తున్నాము మాకు ఏదైనా నష్టపరిహారం చెల్లించమని అడిగిన ఇష్టానుసారంగా మాట్లాడం మీ దిక్కున వారికి చెప్పుకోండి అనే విధంగా ప్రవర్తించడం పట్ల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ యజమాన్యం రైతులతో ఇప్పటివరకు ఏ రోజు కూడా సామరస్యంగా
మాట్లాడిన పరిస్థితి లేదు. ఇప్పటివరకు రైతులను రకరకాలుగా ఇబ్బంది పెడుతూ వారికి కాలుష్యం వల్ల కలిగే నష్టా పరిహారం ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇప్పటికే 714 ఎకరాల రైతులు కాలుష్యం నుండి నష్టపోతు ఉండగా ఈరోజు సిపిఐ కార్యాలయానికి రైతులు విచ్చేసి 320 ఎకరాల రైతులు వారి వివరాలను అందించడం జరిగింది. అదేవిధంగా ఫ్యాక్టరీ యాజమాన్య నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ రేపటి రోజున రాయదుర్గం మండలం ఎమ్మార్వో కార్యాలయం ఏదుట రైతులతో కలిసి ధర్నా నిర్వహించడం జరుగుతుంది. రైతు సమస్యలు తీరేదాకా దశలవారిగా ఉద్యమాలు చేపడుతున్నట్టు ఉన్నతాధికారులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతులు స్వామి వై మోహన్ గురు సిద్ధ స్వామి. రాజు. ఊలెప్ప. శివన్న సుధీర్.మంజు సీనా జయన్న తిపే స్వామి.లింగన్న తదితరులు పాల్గొన్నారు.










Comments