రూ 3 లక్షల కోట్ల సంపద ఆవిరి
ముంబై: భారత స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 592.67 పాయింట్లు క్షీణించి 84,404.46 వద్దకు జారుకోగా.. నిఫ్టీ 176.05 పాయింట్ల పతనమై 25,877.85 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లోని 30 నమోదిత కంపెనీల్లో 23 నష్టపోయాయి. ఈక్విటీ వర్గాల సంపదగా భావించే బీఎ్‌సఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ దాదాపు రూ.3 లక్షల కోట్లు తగ్గి రూ.472.36 లక్షల కోట్లకు పడిపోయింది.
4న గ్రో ఐపీఓ: స్టాక్ బ్రోకింగ్ సేవల యాప్ ‘గ్రో’ మాతృసంస్థ బిలియన్ బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్ రూ.6,632 కోట్ల తొలి పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) వచ్చే నెల 4న ప్రారంభమై 7న ముగియనుంది. ఇష్యూ ధరల శ్రేణిని కంపెనీ రూ.95 -100గా నిర్ణయించింది.
 
  
                      
                               
  








 
  
 
Comments