• Apr 02, 2026
  • NPN Log

    న్యూఢిల్లీ : ఉగ్రవాదులు మతం పేరుతో కశ్మీరులో చేస్తున్న దురాగతాలను పాకిస్థాన్‌కు చెందిన దేవ్‌బంద్‌ మతబోధకుడు ముఫ్తీ సయీద్‌ ఖాన్‌ నిర్ధారించారు. నిస్సహాయ మహిళా శరణార్థుల కనీస ఆహార అవసరాలను వీరు ఎలా తమ లైంగిక వాంఛలు తీర్చుకోవడానికి వాడుకుంటున్నారో వెల్లడించారు. పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు ఈయన అత్యంత సన్నిహితుడు. వీడియో ఎప్పటిదో తెలియదుగానీ.. ‘కశ్మీర్‌.. మన కపటత్వం’ అనే అంశంపై చేసిన ప్రసంగంలో కశ్మీరులో తిరుగుబాటు చీకటి కోణాన్ని ఆయన బట్టబయలు చేశారు. తమనుతాము మతపరమైన యోధులు లేదా ముజాహిదీన్‌గా అభివర్ణించుకునే ఉగ్రవాదులు నిస్సహాయ మహిళలను లైంగికంగా దోపిడీ చేస్తున్నారన్నారు. శరణార్థి శిబిరాల్లోని కశ్మీరీ ముస్లిం మహిళలు, బాలికలు ఒక్క రొట్టె కోసం తమ శరీరాలను పాన్పుగా మార్చాల్సి వస్తోందని చెప్పారు. పాక్‌ మత ప్రముఖుడు అంతర్గతంగా ఈ విషయాన్ని ఒప్పుకోవడం చాలా అరుదని భారత నిఘావర్గాలు పేర్కొన్నాయి. ఆ దేశం పవిత్ర జిహాద్‌ పేరిట చేస్తున్న దారుణాలను ఇది బట్టబయలు చేసిందని తెలిపాయి. పాక్‌ నిఘా సంస్థ ఐఎ్‌సఐ సమకూర్చిన ఆయుధాలు, నిధులతో భారత్‌పై ఉగ్రవాదుల పరోక్ష యుద్ధాన్ని, స్థానిక ప్రజలను దోచుకోవడాన్ని ఇది బయటపెట్టిందని పేర్కొన్నాయి.

     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement