వచ్చే నెల 17 నుంచి టెన్త్ ప్రీఫైనల్ ఎగ్జామ్స్
ఆంధ్ర ప్రదేశ్ : టెన్త్ విద్యార్థులకు ఫిబ్రవరి 17వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ప్రీఫైనల్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు పరీక్షలు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. వీటి అనంతరం గ్రాండ్ టెస్ట్, పబ్లిక్ పరీక్షలు ఉండనున్నాయి. మరోవైపు సంక్రాంతి సందర్భంగా ఈ నెల 10 నుంచి 18 వరకు స్కూళ్లకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే.










Comments