వైసీపీ ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్‌దే నిర్ణయం: అచ్చెన్నాయుడు
ఆంధ్రప్రదేశ్ : యూరియాతో సహా అన్ని అంశాలపై చర్చకు సిద్ధమని మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో అన్నారు. వైసీపీ నేతలు ఇకనైనా తప్పుడు ప్రచారం మానుకోవాలని హితవు పలికారు. కుంటిసాకులతో సభకు రావట్లేదని, వైసీపీ MLAల అనర్హత వేటుపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ప్రతిపక్ష నేతగానూ జగన్ పనికిరారని జనం పక్కనపెట్టారని ఎద్దేవా చేశారు. జగన్ ప్రతిపక్ష హోదా అడగటం మాని, అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలని సూచించారు.
Comments