• Jun 13, 2026
  • NPN Log

    షావోమీ లవర్స్ మీకోసమే.. కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? షావోమీ టీ సిరీస్‌లో ఫస్ట్ షావోమీ 17T స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఈ ఫోన్‌లో 67W హైపర్‌ఛార్జ్ సపోర్ట్‌తో 6500mAh బ్యాటరీ ఉంది. ఇందులో లైకా 5x పెరిస్కోప్ టెలిఫోటో సిస్టమ్, 6.59-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే ఉన్నాయి. అలాగే, ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 32MP ఫ్రంట్ కెమెరా (Xiaomi 17T Sale) ఉన్నాయి. షావోమీ 17T ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధరకు సంబంధించి పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.

     

     

    షావోమీ 17T ధర ఎంతంటే? :
    షావోమీ 17టీ ఫోన్ 12GB+256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 59,999 కాగా, 12GB+512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 64,999గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ సేల్స్ జూన్ 10 నుంచి ప్రారంభమయ్యాయి. ఆసక్తిగల కొనుగోలుదారులు రూ.5వేలు ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌తో సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ షావోమీ వెబ్‌సైట్, ఈ-కామర్స్ సైట్ అమెజాన్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంది.

    షావోమీ 17టీ స్పెసిఫికేషన్లు :
    షావోమీ 17టీ ఫోన్ 6.59-అంగుళాల 1.5K ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. రిజల్యూషన్ 2756×1268 పిక్సెల్స్, 120Hz రిఫ్రెష్ రేట్, 3500 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌ అందిస్తుంది. సేఫ్టీ కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ అందిస్తుంది.

     

     

    ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమిన్షిటీ 8500-అల్ట్రా ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 12GB LPPDDR5X ర్యామ్, 256GB/512GB యూఎఫ్ఎస్ 4.1 ఇన్-బిల్ట్ స్టోరేజ్ అందిస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత షావోమీ హైపర్ OS3పై రన్ అవుతుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68 రేటింగ్‌తో వస్తుంది. 67W ఫాస్ట్ ఛార్జింగ్‌కు 6500mAh బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది.

     

     

    కెమెరా సెటప్ విషయానికి వస్తే..
    ఈ షావోమీ ఫోన్‌లో బ్యాక్ సైడ్ ఎఫ్/1.7 అపర్చర్‌తో 50MP లైట్ ఫ్యూజన్ కెమెరా, ఎఫ్/3.0 అపర్చర్‌తో 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, ఎఫ్/3.0 అపర్చర్‌తో 12MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా ఉన్నాయి.

     

     

    సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ సైడ్ 32MP కెమెరా ఉంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, USB టైప్-సి పోర్ట్, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 7, బ్లూటూత్ 6.0, GPS, NFC ఉన్నాయి. కొలతల పరంగా పరిశీలిస్తే.. ఈ ఫోన్ 157.6 మిమీ పొడవు, 75.2 మిమీ వెడల్పు, 8.17 మిమీ మందం, 200 గ్రాముల బరువు ఉంటుంది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement