సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
సంక్రాంతి పర్వదినాన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. అందరి హృదయాల్లో ఆనందాన్ని నింపే పండుగ ఇదని పేర్కొన్నారు. కాగా ఆయన తెలుగులోనే ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలపడం విశేషం. ‘ఈ పండుగను భారతదేశం అంతటా అత్యంత ఉత్సాహంతో వైభవంగా జరుపుకుంటారు. మన హృదయాల్లో ఆనందాన్ని, కృతజ్ఞతా భావాలను నింపే పండుగ ఇది. ఈ పండుగకు, ప్రకృతితో ఉన్న ప్రత్యేక అనుబంధం అందరికీ తెలిసిందే. ఈ సంక్రాంతి మీ అందరి జీవితాల్లో సుఖ శాంతులని, ఆరోగ్యాన్ని ప్రసాదించాలని, మీ కలలన్నీ సాకారం కావాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను’ అని మోదీ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.










Comments