సింగరేణి భూగర్భ గనిలో ప్రమాదం.. కార్మికులకు అస్వస్థత..
జయశంకర్ భూపాలపల్లి: సింగరేణి భూగర్భ గనిలో ప్రమాదం చోటుచేసుకుంది. కేటీకే 5 ఇంక్లైన్ రెండో లెవెల్ వద్ద వెల్డింగ్ చేస్తున్న క్రమంలో నిప్పు అంటుకుని విషవాయువులు వెలువడ్డాయి. ఈ ప్రమాదంలో అన్వేశ్, ప్రదీప్ అనే ఇద్దరు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన తోటి కార్మికులు బాధితులను చికిత్స నిమిత్తం సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మొదటి షిఫ్ట్ ముగిసే సమయానికి ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న రెస్క్యూ, ఫైర్, సేఫ్టీ సిబ్బంది ముమ్మర సహాయక చర్యలు చేపట్టారు. గని లోపల పంప్ ఆపరేటర్ చిక్కుకున్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Comments