సెప్టెంబర్ 19న భారత మార్కెట్లోకి ఐఫోన్ 17 సిరీస్
ఐఫోన్ ప్రియులకు శుభవార్త. ఎందుకంటే ఆపిల్ ఐఫోన్ 17 లైనప్ భారత మార్కెట్లో సెప్టెంబర్ 19 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లో ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌తో పాటు ఆపిల్ చరిత్రలో మొట్టమొదటి ఐఫోన్ ఎయిర్ కూడా ఉంది. ఈ కొత్త ఫోన్‌లతో పాటు ఆపిల్ వాచ్ సిరీస్ 11, ఆపిల్ వాచ్ అల్ట్రా 3, ఆపిల్ వాచ్ SE3, ఎయిర్‌పాడ్స్ ప్రో 3 కూడా లాంచ్ అవుతున్నాయి.
ఐఫోన్ 17 సిరీస్ హైలైట్స్
గత వారం జరిగిన ఆపిల్ ఈవెంట్‌లో ఐఫోన్ ఎయిర్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇది ఇప్పటివరకూ ఆపిల్ తయారు చేసిన అత్యంత సన్నని ఐఫోన్. ఇది కేవలం 5.6 మిల్లీమీటర్ల మందంతో రూపొందించారు. ఈ సిరీస్‌లోని ఫోన్‌లు అత్యాధునిక ఫీచర్లతో టెక్ ప్రియులను ఆకట్టుకోనున్నాయి.
వీటి ధరలు ఎలా ఉన్నాయంటే
ఐఫోన్ 17 (256GB): రూ. 82,900 నుంచి..
ఐఫోన్ 17 ప్రో (256GB): రూ. 1,34,900
ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ (256GB): రూ. 1,49,900
ఐఫోన్ ఎయిర్ (256GB): రూ. 1,19,900 నుంచి..
ఆపిల్ త్వరలో..
ఈ ఫోన్‌లు ఆపిల్ రిటైల్ స్టోర్‌లలో (ముంబై, ఢిల్లీ, బెంగళూరు, పూణే), ఆన్‌లైన్ స్టోర్‌లో కూడా అందుబాటులో ఉంటాయి. అలాగే, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, బ్లింకిట్ వంటి ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో కూడా ఈ ఫోన్‌లు లభిస్తాయి. ఆపిల్ త్వరలో నోయిడాలో కొత్త స్టోర్, ముంబైలో రెండో స్టోర్‌ను కూడా ప్రారంభించనుంది. క్రోమా, ఇంగ్రామ్ మైక్రో ఇండియా, విజయ్ సేల్స్ వంటి పలు స్టోర్లు ఈ ఫోన్లపై డిస్కౌంట్లు కూడా అందిస్తున్నాయి.
Comments