స్మృతి మంధాన సూపర్ సెంచరీ
ఆస్ట్రేలియా మహిళలు తో జరుగుతున్న రెండో వన్డేలో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన సెంచరీతో చెలరేగారు. 77బంతుల్లో 12ఫోర్లు, 4సిక్సర్లతో శతకం బాదారు. దీంతో భారత తరఫున రెండో ఫాస్టెస్ట్ సెంచరీ చేశారు. తొలి ఫాస్టెస్ట్ సెంచరీ కూడా ఆమె పేరిటే ఉండటం విశేషం. గతంలో స్మృతి ఐర్లాండ్‌పై 70 బంతుల్లోనే శతకం నమోదు చేశారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత టీమ్ 32 ఓవర్లలో 191/3 రన్స్ చేసింది. క్రీజులో స్మృతి, దీప్తి శర్మ(12) ఉన్నారు.
Comments