స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో మొక్కలు నాటిన రంపచోడవరం నియోజకవర్గం మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ లోత లక్స్మన్ రావు
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాజవొమ్మంగి మండలం శరభవరం పంచాయతీలోని శరభవరం పాఠశాల యందు, సచివాలయం నందు, అంగన్వాడి సెంటర్ నందు, అంగన్వాడి సబ్ సెంటర్ నందు మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ లక్ష్మణరావు పరిసరాలను శుభ్రం చేసి, మొక్కలు నాటి స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ శివ, స్కూలు ఉపాధ్యాయులు, అంగన్వాడి టీచర్, హెల్త్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Comments