హైకోర్టులో మాజీ మంత్రి హరీష్ రావు పిటిషన్
మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించారు. తనపై బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌లో నమోదైన క్రిమినల్ కేసును కొట్టేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. హరీష్ రావు నుంచి తనకు ప్రాణహాని ఉందని తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు చక్రధర్ గౌడ్ బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు హరీష్ రావుతో పాటు మరో ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదైంది.అయితే, కేవలం రాజకీయ కక్ష సాధింపుతోనే తనపై ఫిర్యాదు చేశారని, ఈ కేసును కొట్టివేయాలని హరీష్ రావు హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్‌పై విచారించిన న్యాయస్థానం, పబ్లిక్ ప్రాసిక్యూటర్ (PP)ను కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.
Comments