• Apr 01, 2026
  • NPN Log

    హైదరాబాద్ : నగరంలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న మరో కల్తీ మాంసం ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రెండు గోదాములపై మెరుపు దాడులు నిర్వహించి సుమారు 10 టన్నుల కుళ్లిన మాంసాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గోల్కొండ టాస్క్‌ఫోర్స్, హెచ్-ఫాస్ట్, జీహెచ్ఎంసీ అధికారులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించారు. విశ్వనీయ సమాచారం మేరకు మంగళ్‌హాట్‌లోని గోదాములపై దాడులు నిర్వహించగా, నిల్వఉంచిన భారీ మొత్తంలో ఈ కుళ్లిన మాంసం బయటపడింది.

    ఈ దందా వెనుక అఫ్రోజ్ అనే వ్యక్తి కీలలక సూత్రదారిగా వ్యవహరిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. నిందితుడు జమ్ముకశ్మీర్, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్ వంటి రాష్ట్రాల నుంచి చనిపోయిన మేకలను తక్కువ ధరకు తెప్పించి, ఇక్కడ నిల్వచేస్తున్నట్లు విచారణలో తేలింది. ఈ కుళ్లిన మాంసాన్ని నగరంలోని వివిధ హోటళ్లు, బిర్యానీ సెంటర్లకు సరఫరా చేస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడు అఫ్రోజ్‌తో పాటు మొత్తం నలుగురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

    ఈ ఘటనలో సదరు గోదాములను సీజ్ చేసిన అధికారులు.. నమూనాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇటీవల నగరంలో వరుసగా బయటపడుతున్న ఇలాంటి కల్తీ దందాల పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బయట ఆహారం తినేటప్పుడు, మాంసం కొనుగోలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement