1-9 తరగతుల ఎస్‌ఏ పరీక్షల తేదీల మార్పు
హైదరాబాద్ : ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు జరగాల్సిన సమ్మెటివ్ అసెస్మెంట్ (ఎస్‌ఏ-2) పరీక్షల తేదీలు మారాయి. వాస్తవానికి ఇవి ఈనెల 10 నుంచి 20వరకు జరగాల్సి ఉంది. అయితే తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ(టాస్) పరీక్షలు ఉండటంతో ఎస్‌ఏ పరీక్షలన్నీ 2రోజుల ముందు నిర్వహిస్తామని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్ తెలిపారు. ఈ పరీక్షలు ఈనెల 8న ప్రారంభమై 18న ముగుస్తాయని ఒక ప్రకటనలో తెలిపారు. ఒకటో తరగతి నుంచి 7వ తరగతికి సంబంధించిన పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 11-30వరకు జరుగుతాయన్నారు. 8వ తరగతి పరీక్షలు 9 గంటల నుంచి 11-45వరకు, 9వ తరగతి పరీక్షలు 9 గంటల నుంచి 12 వరకు జరుగుతాయని ఆయన తెలిపారు.









Comments