• Jun 05, 2026
  • NPN Log

    విశ్వవిద్యాలయాలలో ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు దరఖాస్తు గడువును ఈ నెల 20 వరకు పొడిగించాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకులు కోరుతున్నారు. 12 రోజుల సర్వీసు తేడా కారణంగా తాము దరఖాస్తు చేసుకొనే అవకాశం కోల్పోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్ర ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఏపీపీఎస్సీ ద్వారా దాదాపు 400 డిగ్రీ కళాశాల అధ్యాపక పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చింది. దీని ద్వారా అప్పట్లో ఎంపికైన వారు 2018 జూన్‌ 10-20 మధ్య విధుల్లో చేరారు. వీరందరికీ ఈ నెల 10-20 మధ్యన 8 సంవత్సరాల సర్వీసు పూర్తవుతుంది. కూటమి ప్రభుత్వం ఇటీవల మే 15న యూనివర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, ప్రొఫెసర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోవటానికి నోటిఫికేషన్‌ను జారీచే సింది. దరఖాస్తు చేసుకోవటానికి తుది గడువుగా జూన్‌ 8వ తేదీని నిర్ణయించారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే, క నీసం 8 ఏళ్ల పాటు రెగ్యులర్‌ అధ్యాపకుడిగా పనిచేసి ఉండాలి. ఈ క్రమంలో 2018లో డిగ్రీ కళాశాల అఽధ్యాపకులుగా ఎంపికైన వారంతా ఈ పోస్టులకు అర్హత సాధించలేని పరిస్థితి ఏర్పడుతోంది. కేవలం కొద్ది రోజుల వ్యత్యాసంతో ప్రొఫెసర్ల పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కోల్పోతున్నారు.

     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement