20 నుంచి వన్యప్రాణుల లెక్కింపు షురూ..
నాగర్కర్నూల్ : దక్షిణ భారతంలో అతిపెద్ద టైగర్ రిజర్వు, నాగర్కర్నూల్ జిల్లా పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో పులులతోపాటు ఇతర వన్యప్రాణుల గణనకు అటవీశాఖ సిద్ధమైంది. ఈ నెల 20వ తేదీ నుంచి వారంపాటు లెక్కింపు ప్రక్రియ చేపట్టనుంది. అటవీ శాఖ పులులు, వన్యప్రాణుల లెక్కింపులో పర్యావరణవేత్తలు, జంతు ప్రేమికులను భాగస్వాములను చేయనుంది. దాదాపు 160 మంది అటవీశాఖ సిబ్బందితోపాటు 800 మంది వరకు జంతు ప్రేమికులు, మరో 100 మంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. రోజుకు 7-10 కిలోమీటర్లు అడవిలో నడుస్తూ పులుల పాద ముద్రలు, వాటి విసర్జితాలను పరిగణనలోకి తీసుకుని వన్యప్రాణులను లెక్కిస్తారు.










Comments